ఎన్ కౌంటర్ లో మరణించిన ”దిశ” నిందితుల మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు డెడ్ బాడీలు భద్ర పరచాలని సూచించింది. విచారణ కమిషన్ మృతదేహాలను పరిశీలించే అవకాశం ఉందని, విచారణ కమిషన్ రీపోస్ట్‌మార్టం అడగొచ్చని తెలిపింది. అప్పటి వరకు డెడ్ బాడీలను భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. రెండు రోజుల్లో కమిషన్ హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉందని హైకోర్టు తెలిపింది.
మృతదేహాల కోసం ఓ వైపు మృతుల కుటుంబాలు ఎదురుచూస్తుండగా..కోర్టు భద్రపర్చాలని ఆదేశించడం మృతుల కుటుంబాలను నిరాశకు గురిచేసింది. ఎన్ కౌంటర్ జరిగి శుక్రవారానికి వారం రోజులైంది. రెండు సార్లు పోస్ట్ మార్టమ్ చేశారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి.