జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు మండిపడింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడాల్సిందేనన్న న్యాయస్థానం… నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.
అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడాల్సిందేనని స్పష్టం చేసిన కోర్టు… 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు, ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను ఆదేశించింది. ఎన్ని నిర్మాణాలపై కోర్టుల్లో స్టే ఉందని, స్టే వెకెట్ పిటిషన్లు ఎన్ని వేశారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ వెకెట్ పిటిషన్లు వేయకపోతే ఎందుకు వేయలేదో చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.
జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలపై చాలా కాలం నుండి కేసు పెండింగ్ లో ఉంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని పలు వ్యాజ్యాలు దాఖలు చేయగా… కోర్టు విచారణకు స్వీకరించింది.