తెలంగాణలో అక్రమ లేఔవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం తెచ్చిన ఎల్.ఆర్.ఎస్ పై దాఖలైన వ్యాజ్యాల విచారణ మరోసారి వాయిదా పడింది. ఎల్.ఆర్.ఎస్ పై వాదనలు విన్న హైకోర్టు…దాఖలైన అన్ని పిటిషన్లలో కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది.
ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు… కేసు విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది.