సూర్యాపేటలో పదుల సంఖ్యలో కేసులు నమోదైనా, లక్షణాలు లేవన్న కారణంగా టెస్టులు నిర్వహించకపోవటంపై హైకోర్టు సీరీయస్ అయ్యింది. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ దేశంలోనే అతి తక్కువ టెస్టులు చేసిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని, ఎందుకు టెస్టులు చేయటం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఎక్కువ టెస్టులు చేస్తేనే కేసుల సంగతి తేలుతుందని… అలా చేయకుండా సూర్యాపేటను కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటించారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై హైకోర్టు కూడా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ… అసలు ఎన్ని టెస్టు కిట్స్ ఉన్నాయని, ఉన్నాయా లేదా అని ప్రశ్నించింది. ఏప్రిల్ 22 తర్వాత సూర్యాపేటలో అసలు టెస్టులు చేశారా లేదా అని కోర్టు ప్రశ్నించింది.
పైగా సూర్యాపేట బార్డర్ లో ఉన్న జిల్లాను అంత తేలికగా ఎలా తీసుకున్నారు అని ప్రశ్నించటంతో పాటు కేరళ తరహాలో మొబైల్ టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవటం లేదు… అలా చేయటంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటీ అని కోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు సంస్థలను వాడుకొని, టెస్టుల సంఖ్యను ఎందుకు పెంచుకోరు అని కోర్టు ప్రశ్నించింది.
మొత్తం అంశాలపై ఈ నెల 26న సమగ్ర రిపోర్టును సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.