ఆర్టీసీ సమ్మె, ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టు ప్రభుత్వానికి ఒకరోజు గడువు ఇచ్చింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో త్రిసభ్య కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా, ఈ కమిటి మాట ప్రకారం నడుచుకుంటారా అంటూ ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని అడిగి బుధవారం ఉదయంలోపు చెప్పాలని ప్రభుత్వ లాయర్‌ను ఆదేశించింది.
చర్చల ప్రక్రియను ప్రారంభించేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉన్నారని, అయితే… ప్రభుత్వం మాత్రం కోర్టు చెప్పిన కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవటం లేదని కార్మిక సంఘాలు కోర్టుకు తెలిపాయి.
అంతకుముందు ప్రభుత్వ లాయర్ ఈ సమ్మెను చట్టవిరుద్ధంగా పేర్కొనాలని కోరారు. గతంలో ఆంధ్రపదేశ్ రోడ్డు రవాణా సంస్థలో సమ్మె చట్టవిరుద్దమని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ఏపీది టీఎస్ ఆర్టీసీకి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది కోర్టు.