గ్రేటర్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. కేవలం స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలంటూ బీజేపీ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు స్వస్తిక్ గుర్తు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారంకు వాయిదా వేసింది.
ఓట్లు వేసే సమయంలో స్వస్తిక్ గుర్తుతో పాటు పెన్ తో మార్క్ చేసినా ఓటును పరిగణలోకి తీసుకోవాలని… చెల్లనిదిగా పరిగణించకూడదని గురువారం రాత్రి ఎన్నికల సంఘం సర్కులర్ జారీ చేసింది. దీనిపై బీజేపీ హైకోర్టులో సవాల్ చేయగా, కోర్టు కేవలం స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.