టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో చుక్కెదురు
తీన్మార్ మల్లన్నపై పెట్టిన మూడు కేసులపై స్టే
హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో పోలీసులు అత్యుత్సాహానికి కోర్టు మొట్టికాయలు
తెలంగాణ లో జరుగుతున్న భూ ఆక్రమణలు ప్రపంచం ముందించి, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్నకు హై కోర్ట్ లో ఊరట లభించింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా పోలీసులు పెట్టిన కేసులపై హై కోర్ట్ స్టే ఇచ్చింది. గతంలో కూడా మల్లన్న తన ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని హై కోర్ట్ ను ఆశ్రయించి తన ప్రచారాన్ని కొనసాగించారు.నాపై పెట్టిన కేసులన్నీ ప్రభుత్వ కుట్రలో భాగమే అన్నారు మల్లన్న. మై హోమ్ రామేశ్వర్ రావు, కెసిఆర్ అక్రమాలను బయటపెట్టి నందుకే కక్ష పూరితంగా కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. పోలీసులకు, ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టన్నారు మల్లన్న.పోలీసులను వాడుకొని కేసులు పెట్టడం దారుణమన్నారు.