11 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవితవ్యం నేడు తేలనున్నది. 9 మంది ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల క్యాడర్ అలాట్మెంట్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది.
వారం రోజుల కిందట సోమేశ్‌కుమార్ తెలంగాణలో కొనసాగింపును కొట్టివేసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించడం ఆయన అక్కడ రిపోర్టు చేయడం జరిగిపోయాయి.
అదే సమయంలో తెలంగాణలో కొనసాగుతున్న డీజీపీ అంజనీ కుమార్, ఐఎస్‌ఎస్ అధికారులు వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్‌రాస్, అమ్రపాలి తదితరులు భవితవ్యంపై గురించి చర్చ జరిగింది. వీరు తెలంగాణలో కొనసాగుతారా? ఏపీ వెళ్తారా అన్నది హైకోర్టు తేల్చనున్నది.
వారం కిందట సోమేష్ కుమార్‌ను హైకోర్ట్ ఏపీకి పంపింది. సోమేశ్ స్థానంలో శాంతికుమారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో సీఎం కేసీఆర్ అంజనీకుమార్‌ను ఇంఛార్జ్ డీజీపీగా నియమించారు.