ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. జనం నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని వర్గాలు సీఎంకు బాసటగా నిలుస్తున్నాయి. సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రకటన తర్వాత ఇదీ పరిస్థితి. ఇంత ఆకస్మాత్తుగా జగన్ ఇంగ్లీష్ మీడియం తీసుకరావటం, పైగా నిర్భంద విద్య అని చెప్పటం వెనుక కారణాలను ఆరా తీస్తే… మొత్తం విషయం వెనుక ఓ తెలంగాణ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది.
అవును… నిర్భంద ఇంగ్లీష్ మీడియం చదివితేనే… భవిష్యత్ ఉంటుంది, ప్రపంచం అంతా ఇంగ్లీష్ వెనుక పరిగెడుతుంటే… మనం ఇంకా మాతృభాషపై ప్రేమతో పట్టుకొని వెలాడటం మంచిది కాదని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు. కానీ మాతృభాషను సెకండ్ లాంగ్వేజ్‌గా తప్పనిసరి చేస్తాం అని కూడా ప్రకటించారు. తద్వారా తెలుగు అంతరించిపోదని స్పష్టం చేస్తున్నారు.
అయితే, జగన్ ఈ నిర్ణయం వెను ఓ తెలంగాణ అధికారి ఉన్నారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఇటీవలే సీఎం కేసీఆర్ విధానాలతో విభేదించి వీఆరెఎస్ తీసుకున్నారు. ఇప్పుడాయన ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారుడిగా పనిచేస్తున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే అధికారిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అణగారిన వర్గాలు, గిరిజనుల అభివృద్ధికి తాపత్రేయపడే ఆయన… వివిధ అంతర్జాతీయ విద్యా సంస్థలతో మంచి సంబంధాలున్నాయి. జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంలో ఆయన పాత్రే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేవలం ఇంగ్లీష్ మీడియం ఆలోచనే కాదు.. విపక్షాలకు నోర్లు మూయించాలంటే ఈ ఇంగ్లీష్ మీడియంను సక్సెస్ చేయటంతో పాటు, సెలబస్ ఎలా ఉండాలి… ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ఎలా బోధన చేయాలి, ప్రస్తుతం ఉన్న టీచర్స్‌కు ట్రైనింగ్ అంశాలను ఇప్పటికే బ్లూప్రింట్ రెడీ అయినట్లు తెలుస్తోంది.