తెలంగాణలో ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ను కంట్రోలర్ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 250రూపాయల ఫైన్ తో జూన్ 30 వరకు, 500రూపాయల ఫైన్ తో జులై 15 వరకు ఐసెట్ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంది.
ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు కంట్రోలర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబరు 17న ఐసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 14 రీజినల్ సెంటర్లలో ఐసెట్ పరీక్ష ఉంటుందని… ఐసెట్ నిర్వహణ కోసం 60 కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు.
కరోనా జాగ్రత్తలతోనే ఐసెట్ పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులు సహకరించాలని కోరారు.