కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఇప్పటికే ఆలస్యమయ్యింది. మరోవైపు వైరస్ ఇప్పట్లో తగ్గే సూచనలు కనపడటం లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది.
మొత్తం 182రోజుల్లో విద్యా సంవత్సరం పూర్తి చేయనున్నారు. గతంలో 220రోజుల పాటు కాలేజీలుండగా…. ఇప్పుడా సంఖ్యను 182కు కుదించేశారు. ఇప్పటికే అకాడమిక్ ఇయర్ ఆలస్యం అయిన నేపథ్యంలో దసరాకు మూడు రోజుల పాటు మాత్రమే సెలవులను ప్రకటించారు. ఇందులో ఓ ఆదివారం కూడా ఉంది. అక్టోబర్ 23 నుండి 25వరకు దసరా సెలవులను నిర్ణయించారు. సంక్రాంతికి కూడా తెలంగాణలో కేవలం రెండు రోజులు మాత్రమే హాలిడే ఉండనుంది. జవనరి 13, జనవరి 14న సెలవులు ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది.
సెప్టెంబర్ 1 నుండి ఇంటర్ విద్యా సంవత్సరం మొదలైంది.