ఎంతో ఉత్కంఠ నడుమ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా విద్యార్థులను సెకెండియర్ కు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. అయితే ఈమధ్యే పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రమోట్ అయినవారికి పరీక్షలేంటని తల్లిదండ్రుల సంఘం హైకోర్టులో కేసు వేసినా నిలబడలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు స్టార్ట్ అయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,768 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా కోవిడ్ ఆంక్షలు విధించారు. తొలిరోజు పరీక్ష ముగిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది.