ఇంటర్ పరీక్ష ఫీజు తేదీలను ఖరారు చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 11 వరకు ఫీజులను చెల్లించాలని విద్యార్థులను కోరింది. ఈ సంవత్సరం కనీస హాజరుశాతాన్ని మినహాయిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
అయితే,సకాలంలో ఫీజు చెల్లించని వారికి ఫైన్ తో గడువు ప్రకటించింది. ఫిబ్రవరి 11 తర్వాత ఫీజు చెల్లించే వారికి ఫైన్ ఇలా ఉంటుంది.
రూ.100 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 22 వరకు గడువు
రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 2 వరకు ఫీజు గడువు
రూ.1000 ఆలస్య రుసుముతో మార్చి 9 వరకు ఫీజు గడువు
రూ.2వేల ఆలస్య రుసముతో మార్చి 16 వరకు ఫీజు గడువు