డా. చెరుకు సుధాకర్
ఇంటి పార్టీ అధ్యక్షులు
కరోనా నేపద్యంలో ప్రదానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీని వివరించిన ఆర్ధిక మంత్రి సీతారామన్ మేక్ ఇన్ ఇండియా అనుబంధ పరిశ్రమలు, రియల్ఎస్టేట్, బ్యాంకులు, వడ్డీ సడలింపుల గురించే మాట్లాడింది కానీ మేకింగ్ ఇండియా శ్రమజీవుల గురించి మాట్లాడింది, కేటాయించింది 41కోట్ల జన్‌దన్ ఖాతలో 52 వేల కోట్ల రూపాయలు మాత్రమే. డిస్కంకు రుణాల్లో విద్యుత్లో రాష్ట్రాల అధికారులను కుదించవద్దని, కోట్లాది మంది పేదలకు కనీసం 5 లక్షల కోట్ల ప్యాకేజీ కావాలని డిమాండ్ చేద్దాం.
ఏది కాక మందే 20 లక్షల కోట్లంటే కేసియార్ హెలీక్యాప్టర్ మనీ అమలవుతుందని కేరింతలు కొట్టే వాళ్ళు స్వంత కాళ్ళ మీద, ఆర్ధిక అభివృద్దిని సాధించవలసి ఉంది. రాష్ట్రాలకు నిర్ధిష్టంగా ఏ రంగాలకు, ఎంత కేటాయించే వివరాలు ఏమీ లేకపోవడం విచారకరం.
పోతిరెడ్డిపాడుపై సుప్రీం కోర్టుకు పోతామన్న కేసియార్ ప్రక్క రాష్ట్ర సియం జీ.వో. 203 ప్రకటించినప్పటినుండి ఏమి చేస్తున్నారో చెప్పవలసి ఉన్నది. పోతిరెడ్డపాడుపై తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ద ఉద్యమం చేసిన పార్టీలను, ప్రజా సంఘాలను ఐక్యకార్యాచరణకు పిలువవలసిన భాద్యత కేసియార్ మీద ఉన్నది.
శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులు ఎందుకు ఇంత నత్త నడక నడుస్తున్నాయో, కాళేశ్వరం సర్జ్‌పూల్స్, బాహుబలి మోటర్లు, అధునాతన ఇరిగేషన్ టెక్నాలజీ నల్లగొండలో టన్నల్ తొవ్వడానికి ఎందుకు అందుబాటులోకి రావడం లేదో కేసియార్ చెప్పాలి. దక్షణ తెలంగాణ నాయకులు కేసియార్ భజన మాని, పాలమూరు, నల్లగొండ ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి అయ్యేట్లుఉద్యమం చేయాలి. వీటికి అందుబాటులోని నీరును తరలించుకుపోయే పోతిరెడ్డిపాడు రెండవ దశ పనులను ఆపివేయాలని డిమాండ్ చేయాలి. త్వరలో తెలంగాణ ఇంటి పార్టీ ఉద్యమ మిత్రులు, సంస్థలతో ఐక్య కార్యాచరణకు సిద్దం అవుతుంది.