చెరుకు సుధాకర్.
ఇంటి పార్టీ అధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయంతో రాష్ట్రాలకు ప్రత్యేక్ష వాట లేకపోవటం కేంద్ర ఆధిపత్య దోరనికి నిదర్శనం. ఇరవై లక్షల కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా పేద ప్రజలకు, వలస కార్మికుల కోసం ఉపయోగపడే విధంగా లేవు. బడా బాబులకు తప్ప సామాన్య ప్రజలకు చెందని,అందని ఎంత సొమ్మైన ఆర్థిక దుర్వినియోగమే. కరోనా ప్యాకేజీలో కేంద్రం వద్ద తమ వాటాను డిమాండ్ చేసే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు లేవు అందుకు తెలంగాణ ఎం మినహాయింపు కాదు. ఆర్థిక సంఘం సభ్యులు మెతక దొరనే నేడు రాష్ట్రం దివాలా తియ్యడానికి కారణం. గట్టిగా మాట్లాడితే మంత్రుల, ముఖ్యమంత్రుల ఆర్థిక మూలాలు బైట పడతాయని భయంతోనే కేంద్రం వద్ద రావాల్సిన వాటాను గట్టిగా అడగటం లేదు. దక్షణ తెలంగాణను ఎడారి చేసే పోతిరెడ్డిపాడు విషయంలో కేంద్ర జలవనరుల శాఖ జోక్యం చేసుకొని ఆ ప్రాజెక్ట్ ను నిలిపివేయాలి. ఉపాధి కూలీలు డబ్బులు తక్షణమే చెల్లించి పేదవాడికి కరోనా టైమ్ లో కాస్త ఉరటనివ్వలి. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి విధుల్లోకి తీసుకోవాలి.