డా.చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
తెలంగాణ రాజకీయ వలసకూలీల పార్టీ నీది కెసిఆర్. నిన్న ఒక ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ మాట్లాడిన మాటలు అయన స్థాయిని దిగజార్చాయి. ఒక ఉద్యమకారుల పార్టీని అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటు. పక్కా తెలంగాణ వాదుల ఇంటి పార్టీ మాది. తెలంగాణ ద్రోహులను చేర్చుకొని ఉద్యమకారులకు ద్రోహం చేసిన తెలంగాణ రాజకీయ వలసదారుల పార్టీ నిది కెసిఆర్. నువ్వు Rtc కార్మికులను రోడ్డు పాలు చేస్తే ముందుండి వారికోసం కొట్లాడింది మేము. కెసిఆర్ ని నిర్లక్ష్యం వల్ల 29 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు అండగా ఉన్నది మేము. మేము అంటే తెలంగాణ ఇంటి పార్టీ మీలాగా పక్కవాళ్ళని తెచున్న వలసదారుల పార్టీ కాదు. నీకు దమ్ముంటే బహిరంగ చేర్చకు సిద్ధమా.? ఎవరు ఎం చేసారో తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలందరికీ తెల్సు. తెలంగాణ ఉద్యమమం ఉవ్వెత్తున లేచిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా తోకముడుచుకున్నది నువ్వు కెసిఆర్,నువ్వా డిపాజిట్ల గురించి మాట్లాడేది. మేము పోటీ చేసిన ప్రతి దగ్గర గెలుపు ఓటములను తారుమారు చేసాం ఆ భయంతో మా ఎన్నికల గుర్తును రద్దు చేపించింది నువ్వు. తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నింస్తుంటే తట్టుకోలేక ఈ చౌకబారు అవహేళన మాటలు మాట్లాడుతున్నాడు కెసిఆర్. కెసిఆర్ తన దొరతనం చుప్పించుకుంటా అంటే నడవదు. గతం గుర్తు తెచ్చుకో ఎం జరిగిందో మళ్ళీ అది పునరావృతం కాకుండా చూసుకో కెసిఆర్. ఆనాడు మేము లేకుంటే అసలు ఇవ్వాళ TRS ఉండేదా. కొంచం మాట్లాడే ముందు ముందు వెనక అలోచించి మాట్లాడితే మంచిది కెసిఆర్. నీ బినామీలు రామేశ్వర్ రావు, కృష్ణ రెడ్లకొసం తెలంగాణ అమరుల ఆకాంక్షను తాకట్టు పెట్టిన నీకు తెలంగాణ వాదుల పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు నీకు కెసిఆర్. అఖిలపక్షాన్ని తక్కువ చేసిన మాట్లాడిన నీకు ఏ జిల్లాలో ఎన్ని కరోనా టెస్టులు చేసారో,రోజుకు ఎన్ని టెస్టులు చేస్తున్నారో బహిరంగ పరిచి సీఎం కరోనా నిధి అడిట్ చేసే దమ్ము ఉందా నీకు కెసిఆర్.