తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి హరీష్ రావు రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ ను సభ ముందు ఉంచారు. ఇందులో నీటి పారుదల రంగానికి బడ్జెట్ లో రూ.26,885 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
తమతో పాటు ఎవరు వచ్చినా రాకపోయినప్పటికీ ప్రజల ఆశీస్సులే కొండంత అండగా భావించి.. తెలంగాణ సర్కార్ కోటి 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జరిపిస్తోంది. కేంద్రం తోడ్పాటు ఇవ్వకపోవడంతో పాటు అనేక అడ్డంకులు కూడా సృష్టిస్తోందని ఆయన అన్నారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను నిర్ధారించమంటే. .విపరీతమైన తాత్సారం చేస్తోంది.
రాష్ట్రంలో నిర్మిస్తున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. స్పందించడం లేదు.’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.