వ్యవసాయం ఒక పరిశ్రమగా విస్తరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశం మొత్తం వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్నే ఆదర్శంగా తీసుకుంటోందని చెప్పారు. రైతులకు ఆధునిక పరికరాలు అందించడం ఎంతో అవసరమన్నారు.
భారత దేశంలో వ్యవససాయం పనితీరు మారాలని అభిప్రాయపడ్డారు. పెట్టుబడి ఖర్చులు తగ్గాలంటే పరికరాలతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలకు భారతదేశమే ఆహారం అందించగలదన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో నూతన ఆధునిక పరికరాల పరిశ్రమ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణలోని 5 కోట్ల జానాభాలో 96 శాతం 5 ఎకరాలలోపు రైతులు ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్ని రకాల పంటలు పండే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వ్యాఖ్యానించారు. తక్కువ భూమి ఉన్నా.. అందులోనూ అద్భుతమైన పంటలు పండించాలన్నారు.