– బీర్ల అమ్మకాల్లో తెలంగాణ టాప్
– ప్రభుత్వంపై కొండా సెటైర్లు
హైదరాబాద్, తొలివెలుగు:తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ తప్పుడు నిర్ణయాలను నిత్యం ప్రశ్నిస్తూ ఉంటారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సోషల్ మీడియాలో విశ్లేషణాత్మకంగా తరచూ సెటైర్లు వేస్తుంటారు. తాజాగా మరోసారి సెటైరికల్ గా చురకలంటించారు.
బీర్ల అమ్మకాల్లో సౌత్ ఇండియాలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలించిందని ఓ న్యూస్ క్లిప్పింగ్ ను ట్విటర్ లో షేర్ చేశారు. దానిపై వివరిస్తూ.. కేసీఆర్ పై విమర్శలు చేశారు. తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ కు అభినందనలు అంటూ సైటైర్లు వేశారు.
‘‘తలసరి పర్ క్యాపిటా 11 లీటర్ల బీర్ సేవించారు. మీరు నెంబర్ వన్ స్థానంలో ఉండగా, ఆఖరికి ఏపీ కూడా 2 వ స్థానంలో ఉంది. మీ దూరదృష్టి, ప్రణాళికకు సరిపోలేదు. మునుగోడు ప్రభావంతో మూలన ఉన్న విస్కీ విక్రయాల్లోనూ నెంబర్ వన్ చేస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
Congratulations CM KCRao, you have made Telangana No.1 state.
@ 11 liters beer per capita you are No.1
Even AP is a distant 2ndYour foresight, planning & your vision (double?) cannot be matched.
I am sure you will ace it in Wiskey sales also, with Munugodu around the corner. pic.twitter.com/G6CpM6XL4M
— Konda Vishweshwar Reddy (@KVishReddy) August 5, 2022
Advertisements