ప్రముఖ రాజకీయ నాయకుల ట్విట్టర్ అకౌంట్లు వరుసగా హ్యాక్ కు గురవుతున్నాయి. ఇటీవల టీడీపీ, వైసీపీ పార్టీలు సహా పలువురు నాయకుల ట్విట్టర్ ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఐటీ శాఖ అకౌంట్ హ్యాక్ అయింది.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం హ్యాక్ కు గురవ్వగా.. సోమవారం బయటకు వచ్చింది. ఐటీ శాఖ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ పేరును హ్యాకర్స్ మార్చడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.
రంగంలోకి దిగిన ఐటీ శాఖ అకౌంట్ ను గంటలోనే రికవరీ చేసినట్లు తెలుస్తుంది. అయితే అధికారుల అలసత్వంతోనే హ్యాకింగ్ కు గురైందని విమర్శలు వస్తున్నాయి. ఐటీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
హ్యాకింగ్ తో తెలంగాణ పూర్తి సమాచారం హ్యాకర్స్ కు తెలుస్తుందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.