19న తెలంగాణ బంద్ - Tolivelugu

19న తెలంగాణ బంద్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. అన్ని పక్షాలూ రోడ్ల మీదకు వస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చి ఉద్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.

Telangana JAC Calls for State Wide Bandh On Oct19th, 19న తెలంగాణ బంద్
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె ఉధృతరూపం దాల్చుతోంది. దీనిపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో కార్యాచరణను ప్రకటించారు. ఈనెల 19న తెలంగాణ బంద్‌కి పిలుపునిచ్చారు. అదే విధంగా రాబోయే 5 రోజులకు కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 13న వంటా వార్పు, 14న అన్ని ఆర్టీసి డిపోల ముందు బైఠాయింపు, ఇందిర పార్క్ దగ్గర సభ, 15వ తేదీన రాస్తారోకో, మానవహారం, 16న విద్యార్థి సంఘాల ర్యాలీలు, 17 న ధూమ్ ధాం, ఉద్యోగుల కార్మికుల ఆందోళన 18న బంద్ కోసం బైక్ ర్యాలీ, 19న తెలంగాణ బంద్ వుంటుంది. ఇలా అన్ని జిల్లాల బస్ డిపోల ముందు ఆందోళన ఉండేలా కార్యాచరణ రూపొందించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp