అధికార పార్టీ నేతల రౌడీయిజానికి జగిత్యాల జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరుడన్న ఏకైక కారణంతో జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామానికి చెందిన చిట్ల విజయ్ ను స్థానిక జెడ్పీటీసీ భాదినేని రాజేందర్, ఆయన అనుచరులు వేధించినట్లు విజయ్ ఆరోపించారు. తను ఆత్మహత్య చేసుకుంటున్నానని… తన చావుకు కారణమైన వారి పేర్లు రాసి మరీ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ఈ మొత్తం కేసులో అధికార పార్టీ నేతలకు స్థానిక బుగ్గారం పోలీసుల సహకారం ఉందని, ఎస్సై చిరంజీవి తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టి వేధించాడన్నారు. తనతో పాటు తన బావను కూడా ఇరికించారని… కోర్టు ఆర్డర్స్ ఉన్నా ఎదో ఒక కారణం చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారన్నారు. తన భూమిలో రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తను ఏం చేసినా తనను వదిలేలా లేరని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిట్ల విజయ్ చికిత్స పొందుతున్నాడు.
తన మరణ వాంగ్మూలంగా భావించాలంటూ… కరీంనగర్ కమిషనర్ కు చిట్ల విజయ్ రాసిన లేక ఇదే…
శ్రీయుత గౌరవనీయులైన కమీషనర్ అప్ పోలీస్ కరీంనగర్ గార్కీ…
అయ్యా
విషయం:- నాపై బుగ్గారం జడ్పీటీసీ భాదినేని రాజేందర్(రౌడీ షిటర్), బుగ్గారం ఎసై మంద చిరంజీవి, దావనందుల శేఖర్, గోవిందుల ప్రభాకర్, గోవిందుల నారాయణ, నెరుకోమ్ముల లక్ష్మణ్ రావు, కోత్తగోవిందుల పాపయ్య, బచ్చల లింగయ్య, దావనందుల లచ్చయ్య వేదింపులు తట్టుకోలేక అత్మహత్య చేసుకునట గురించి.
నా పేరు విజేయ్ చిట్ల S/O ప్రభాకర్ వయస్సు: 28 సంవత్సరాలు, కులం: మున్నురుకాపు అనబడే నేను గోపులపూర్ గ్రామం బుగ్గారం మండలం జగిత్యాల జిల్లాలో వ్యవసాయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో క్రియశీలకంగా పని చేస్తున్నను నేను కాంగ్రెస్ పార్టీలో అతనికి వ్యతిరేకంగా పనీ చేయ్యడం నచ్చనీ బుగ్గారం జడ్పీటీసీ భాదినేని రాజేందర్(టిఆర్ఎస్)【రౌడీ షిటర్】S/O రాయమల్లు నాపై కక్ష పెంచుకోనీ 2017 నుంచి నన్ను తన అనుచరులైన గోవిందుల ప్రభాకర్ S/O రాజయ్య, దావనందుల శేఖర్ S/O నారాయణ, గోవిందుల నారాయణ S/O పోశయ్య, నెరుకోమ్ముల లక్ష్మణ్ రావు S/O హన్మంత్, కోత్తగోవిందుల పాపయ్య S/O తిమ్మయ్యలతో కలిసి తీవ్ర వేదింపులకు పాల్పడుతున్నరు. ఈ క్రామంలో 2018 నుంచి అప్పటి బుగ్గారం ఎసై రవిందర్ సార్ ద్వారా తనను పదే పదే పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తు రౌడీ షిట్ తెరుస్తాం అంటు తనను తీవ్ర వేదింపులకు గురి చేశారు ఎసై రవిందర్ సార్ బుగ్గారం నుంచి ట్రాన్స్ఫార్ అయ్యి వెళ్ళీపోయిన తర్వాత కోద్దిరోజులు వేదింపులు అగిపోయాయి తిరిగి మళ్ళీ 13 పిబ్రవరి 2020 న బుగ్గారం ఎసై చిరంజీవి సార్ రమ్మంటున్నరు అంటు కానిస్టేబుల్ ఇంటికి రాగా వెళ్ళీ ఎసై గారిని కలిసి విషయం అడుగగా నీ మీద పిటిషన్ వచ్చింది నీకు గుద్ద బలుపు బగ ఉందాట అది తిద్దామనీ పిలిపించిన అదికార పార్టోల్లతో నీకు ఎందుకురా అంటు తీవ్రమైన పదాజలంతో దూషించి నా పోన్ లాక్కోనీ సాయంత్రం 06:00 గంటల వరకు స్టేషన్లోనే ఉంచుకోనీ నా పోన్ ఇవ్వకుండా రేపు వచ్చి తీసుకోవాలని స్టేషన్ నుంచి వెళ్ళగోట్టరు నేను ప్రోద్దున్న స్టేషన్ కు వెళ్ళి నా పోన్ అడిగితే మళ్ళీ రేపు రా అనడంతో చేసేది ఎం లేక అక్కడి నుంచి వెళ్ళీపోయాను ఇలాగే నన్ను వారం పాటు నా పోన్ ఇవ్వకుండా నన్ను తిప్పుకోవడంతో నేను 20-02-2020 రోజున స్టేషన్ కు వెళ్ళీ నా పోన్ అయిన నాకు ఇవ్వండి లేదా నా మీద పిటిషన్ వచ్చింది అంటుర్రు కదా కేసు అయిన నమోదు చేయ్యండి లేదంటే నేను ఎస్పీ గారీ దగ్గరకు కానీ కమీషనర్ గారి దగ్గరకు వెళ్ళీ కంప్లైంట్ చేస్తా అనడంతో నా పోన్ నాకు ఇచ్చేసారు దీంతో ఇక వెళ్ళమంటర సార్ అనీ అడగడంతో ఇప్పుడు వెళ్ళు తర్వాత నాకు దోరకకూండా పోవు నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి జీవితంలో నిన్ను దేనికి పనికిరాకుండా చేసిన తర్వాతనే బుగ్గారం నుండి వెళ్ళిపోతా నువ్వు నా మీదనే కమీషనర్ గార్కీ కంప్లైంట్ చేసే మోనగానివి అయినవ నీ ఆదార్ కార్డు జిరాక్స్ ఇవ్వు నేను పోన్ చేసినప్పుడు స్టేషన్ కు రా ఎమ్మార్వో గారి ముందు నీన్ను రెండు లక్షలకు బైండోవర్ చేస్తా అంటు నా అదార్ కార్డు జిరాక్స్ తీసుకోనీ స్టేషన్ నుంచి వెళ్ళగోట్టరు ఆరోజు నుంచి ఎసై గారు నాపై కక్ష పెంచుకున్నరు. నాపై రాజకీయంగా కక్ష పెంచుకున్న బుగ్గారం జడ్పీటిసి భాదినేని రాజేందర్(రౌడీ షీటర్) ప్రోద్భలంతో అతనీ అనుచరులు అయిన దావనందుల శేఖర్, గోవిందుల ప్రభాకర్, గోవిందుల నారాయణ, నెరుకోమ్ముల లక్ష్మణ్ రావు, కోత్తగోవిందుల పాపయ్య, దావనందుల లచ్చయ్య అను ఈ అరుగురు వ్యక్తులు సిర్వంచకోట శివారులోనీ 187 సర్వే నంబర్ లో గల నా పోలంలో నుంచి అక్రమంగా రోడ్డు వేసి నాకు తీవ్రంగా నష్టం కలిగించేలా ప్రయత్నీస్తుండటంతో నేను 28-06-2020 రోజున జగిత్యాల కోర్టులో దావా వేశాను 09-07-2020రోజున దావనందుల శేఖర్, గోవిందుల ప్రభాకర్, గోవిందుల నారాయణ, నెరుకోమ్ముల లక్ష్మణ్ రావు, కోత్తగోవిందుల పాపయ్య ఈ ఐదుగురు వ్యక్తులకు నోటిసులు వచ్చాయి అట్టి నోటిసులను ఏ మాత్రం లేక్క చేయ్యకుండా మమ్మల్నీ ఎవరు ఎం చేయ్యాలేరు అంటు మరుసటి రోజు 10-07-2020 రోజున ప్రోక్లయిన్ తీసుకువచ్చి రోడ్డు వేసేందుకు ప్రయత్నీంచగా నేను నా తల్లి అయిన చిట్ల లక్ష్మీ W/O ప్రభాకర్ బుగ్గారం పోలీస్ స్టేషన్ కు వెళ్ళీ పైన తెలిపిన ఐదుగురు వ్యక్తులపై వ్రాతపూర్వకంగా పిర్యాదు చేయ్యడం జరిగింది దరాఖాస్తు ఇచ్చినట్టు రిసిప్ట్ ఇవ్వమనీ ఎసై గారిని అడుగగా అలా ఇవ్వడం కుదురదు అంటు వాళ్ళు నీ భూమీలో పోయ్యారు వెళ్ళు అంటు నన్ను నా తల్లినీ స్టేషన్ నుండి పంపించారు ఆ మరుసటి రోజు 11-07-2020 నా మరల నా పోలం నుండి రోడ్డు వేసేందుకు ప్రయత్నీస్థున్నారనీ తెలియడంతో నేను ప్రోక్లయిన్ ఓనర్ కోరుట్ల కు చెందిన రమేష్ కు పోన్ చేసి నా భూమీలో నుండి రోడ్డు పోయ్యోద్దు అది కోర్టు వివాదంలో ఉంది అని చెప్పగా అతను రోడ్డు పోసెందుకు నిరాకరించడంతో బుగ్గారం ఏఏసై రమణారెడ్డి సార్ మోఖ మీదకు వెళ్ళీ నాకు పోన్ చేసి (ఆ టైంలో నేను కల్లడ మీదుగా జగిత్యాల వెళ్ళుతున్నాను) నీ భూమి లో నుండి రోడ్డు పోయాకూండా నేను చూసుకుంట మిషన్ అపకు మనీ చెప్పడంతో నా భూమిలో నుండి రోడ్డు పోయక్కపోతే నేను ఎందుకు అపుతా సార్ అనడంతో పోయ్యకుండా చూసే బాద్యత నాదీ అనీ హమీ ఇచ్చారు అయినా రోడ్డు పోసెందుకు ప్రోక్లయిన్ ఓనర్ నిరాకరించడంతో అదే రోజు సాయంత్రం అందదా సమయం 05:00 గంటల నుండి 06:00 గంటల మద్యలో గోవిందుల నారాయణ నా పోలం దున్నే ట్రాక్టర్ ఓనర్ కంది మల్లయ్య ఇంటికి చిట్ల ప్రభాకర్ పోలం దున్నితే ట్రాక్టర్ టైర్లు కోస్తాం అంటు బయపెట్టడు 12-07-2020 నా ప్రోద్దున్నే నేను కంది మల్లయ్యకు పోన్ చేసి ఈరోజు నారుమళ్లు దున్ని మోలుక అలుకలే రామ్మనీ అడుగగా తను రాననీ జరిగిన విషయం చెప్పడంతో ఇక చేసేదేం లేక కాళ్ళతో తోక్కీ మోలుక అలుకడానికి వెళ్ళేందుకు సిద్దం అవ్వగా బుగ్గారం ఎసై గారు రమ్మంటున్నరు అంటు బుగ్గారం పోలీస్ స్టేషన్ నుండి పోన్ రావడంతో పోలీస్ స్టేషన్ కు నేను, మా అమ్మ చిట్ల లక్ష్మీ, మా భావ తూము శేఖర్ కలిసి వెళ్ళీ ఎసై గారు రమ్మనరంట ఎం విషయం సార్ అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ ను అడుగగా ఎసై గారు లేరు కాసేపు ఉండు వచ్చిన తర్వాత చెప్తారు అంటు నా పోన్ లాక్కున్నరు ప్రోద్దున్న నుండి నేను అన్నం తినలేదు సార్ అన్నం తినీ వస్తా అకలి అవుతుంది అంటే కూడా వినకుండా ఎటు పోయేది లేదు సార్ వచ్చే దాకా అక్కడ కూర్చో అంటు సాయంత్రం 06-00 గంటల వరకు స్టేషన్ లోనే కుర్చోబెట్టరు సాయంత్రం అరు గంటలకు స్టేషన్ కు వచ్చిన ఎసై గారు నన్ను చూడగానే చేప్పుకోలేనీ విదమైన బూతుపదజాలంతో నన్ను తీవ్రంగా దూషించారు అదేంటి సార్ అట్ల తిడుతున్నరు అని మా భావ తూము శేఖర్ అడుగగా ఎయ్ ఎవడ్రా నువ్వు ఎ ఊరురా నీదీ మూసుకోనీ దెంగేయ్ గాడిదికోడుక ఇక్కడ నుండి దెంగేయ్ ఎక్కువ మాట్లడితే గుద్ద పగులదెంగి ప్రోక్లయిన్ కాలబెడుతా అనీ ఓనర్ కు పోన్ చేసి బెదిరించిర్రు అనీ కేసు పెడుతా అంటు బెదిరించిండ్రు అనంతరం ప్రోక్లయిన్ ఓనర్ కు పోన్ చేసిన ఎసై గారు నీ మీషన్ కు ఎం కాకుండా చూసుకుంట నువ్వు రోడ్డు పోయ్యామనీ చెప్పగా అతను అందుకు నిరాకరించడంతో కోపంతో ఊగిపోతు వాడు అంటే ఉత్త అడిగుళ్ళోడు నేనే మీషన్ మాట్లడి రేపు పంపిస్తా నువ్వేం చేస్తావో నేను చూస్తా నువ్వు మోఖ మీద కనపడ్డవంటే నీమీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తా అప్పుడు నీకు ఎవడు అడ్డం వస్తాడో చూస్తా అంటు పక్కనే ఉన్న గోల్లపల్లి హెడ్ కానిస్టేబుల్ కు ఇంకో మిషన్ మాట్లడమంటు చెప్పి నన్ను స్టేషన్ నుండి వెళ్ళగోట్టరు నా పోలం దున్నవద్దు అనీ ట్రాక్టర్ ఓనర్ ను బెదిరించిన వారిపై తను దరాఖాస్తు ఇస్తా అంటే ఎసై గారు తీసుకోను ఎం చేసుకుంటవో ఎక్కడ చెప్పుకుంటవో చెప్పుకో అనడంతో చేసేదీ ఎమీ లేక నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆ మరుసటి రోజు 13-07-2020 నా నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరు కానీ పోలం వైపు వెళ్ళలేదు మా అడ్వకేట్ గారు కోర్టు పనుల కోసం కోన్నీ డాక్యుమెంట్లు అడుగగా మేం బుగ్గారం ఎమ్మార్వో అపిస్ జగిత్యాల జిల్లా కలేక్టరేట్ మరియు అర్డీవో అపిస్, డివిజనల్ ఎస్సారెస్పీ అపిస్ లో డాక్యుమెంట్స్ సేకరణలోనే ఉన్నాం కానీ నాపై నా కుటుంబం పై రాజకీయంగా కక్ష పెంచుకున్న జడ్పీటీసీ భాదినేని రాజేందర్(రౌడీ షిటర్) అతనీ అనుచరుల ప్రోద్భలంతో బుగ్గారం ఎసై చిరంజీవి గారు 14-07-2020 రోజున నాపై రెండు అక్రమ కేసులు పెట్టినారు దాంట్లో ఓక్క కేసు భాదినేని రాజేందర్ అనుచరుడు బచ్చల లింగయ్య అనే వ్యక్తీనీ నేను కులం పేరుతో దూషించి చంపుతా అనీ బెదిరించినట్టు నాపై మరియు నా కుటుంబంపై మరీయు మా గ్రామంతో ఎటువంటి సంభందం లేనీ మా భావ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉద్దేశపూర్వకంగా పెట్టి నన్ను నా కుటుంబన్నీ ఈ కేసులో ఇరికించారు. మరోక్క కేసు సోషల్ మీడియాలో ఆసత్యలు ప్రచారం చేసి ఇరు వర్గాలను రెచ్చగోట్టినట్టు నాకు సంభందం లేనీ ఓ పోస్ట్ గురించి నన్ను కనీసం ఎట్లాంటి విచారణ చేయ్యకుండానే కేవలం దరాఖాస్తు ఇచ్చిన గంటలోనే కేసు నమోదు చేసిన మరో రెండు గంటలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ఉద్దేశపూర్వకంగానే చేసి నన్ను నా కుటుంబన్నీ అర్థికంగా, మనసికంగా దెబ్బతీయ్యాలనే కుట్ర పన్నిన్న భాదినేని రాజేందర్ ప్రోద్భలంతోనే బుగ్గారం ఎసై గారు నాపై అక్రమ కేసులు పెట్టి నన్ను సంఘవిద్రోహ శక్తీగా మలిచే ప్రయత్నం చేస్తుండటమే కాకుండా నా కుటుంబ సభ్యులను పదే పదే బుగ్గారం ఎసై పోన్ల్ చేస్తూ గోపులపూర్ లోనీ నా ఇంటికి ఇద్దరు కానిస్టేబులతో కలిసి వెళ్ళీ నా చెల్లెలు తుము లావణ్య తో అసభ్యకరంగా చెప్పుకోలేని విదంగా మాట్లడుతు తీవ్ర వేదింపులకు గురి చేయడమే కాకుండా కరీంనగర్ లోని మా పెద్ద బావ తుము రవిందర్ ఇంటికి ఏఏసై, మరియు కానిస్టేబుల్లను పంపి బుగ్గారం పోలీస్ స్టేషన్ కు రావలంటు అరస్మేంట్ చేసారు అసలు తనకు సంభందం లేనీ విషయంలో తనను ఎందుకు లగుతున్నరు వాళ్ళకు నాకు ఎం సంభందం లేదు నేను ఎదైన తప్పు చేస్తే నన్ను తీసుకెళ్ళండి అని మా పెద్దభావ పోన్ లో ఎసై గారితో చెప్పగా నువ్వు వస్తే చక్కగా రా లేదంటే నిన్ను ఎలా తీసుకెళ్ళాలో అలా తీసుకెళతమంటు ప్రతిరోజూ మీరు వస్తార రార అంటు పోన్ చేసి తీవ్ర వేదింపులకు పాల్పడ్డారు తేదీ: 05-08-2020 రోజున గౌరవ హైకోర్టు అట్రాసిటీ కేసులో మా కుటుంబం పై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని స్టే ఇచ్చిన మా పెద్ద భావ తూము రవిని స్టేషన్ కు రావలంటు వేదించడంతో తేది: 07-08-2020 న మా భావ తూము రవి బుగ్గారం పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా ఎసై గారు లేరనీ వెయిట్ చేయ్యండి అని స్టేషన్ లో ఉన్న సిబ్బంది చెప్పగా మద్యాహ్నం 02:30 నిమిషాల దాక చూసి ఎసై గారు రాకపోవడంతో కరీంనగర్ లోనీ తన ఇంటికి చెరుకున్న అరగంటలో టైం అందాద 04:10 నుండి 04:30 నిమిషాల మద్య మళ్ళీ కానిస్టేబుల్ ను పంపి ఎసై గారినీ కలువకుండా వచ్చావు ఎసై గారు రమ్మంటున్నరు వస్తావ రావ రాకపోతే రేపు కథ వేరే అయితది అంటు బెదిరించి వెళ్ళిపోయ్యారు ఇక గోపులపూర్ లో నా చెల్లెలు పోలం దున్నించేందుకు రెండు ట్రాక్టర్లు మాట్లడగా గోవిందుల ప్రభాకర్, దావనందుల లచ్చయ్యలు ట్రాక్టర్ ఓనర్లను పోలం దున్నితే బాగుండదు అంటు ట్రాక్టర్ ఓనర్లను బెదిరించి నా పోలం దున్నకుండా బీడు ఉంచి నన్ను నా కుటుంబన్నీ అర్థికంగా, మానసికంగా తట్టుకోలేనీ పరిస్థితి తీసుకవచ్చినందున మరియు నేను ఎక్కడకు వెళ్ళిన నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేక నాకు నా జివితంపై విరక్తితో నేను చేయ్యనీ తప్పులకు సంఘవిద్రోహిగా ముద్ర వేయించుకోనీ ఈ లోకంలో బ్రతుకలేక అత్మహత్య చేసుకుంటున్నను నన్ను అత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించిన బుగ్గారం జడ్పీటీసీ భాదినేని రాజేందర్, బుగ్గారం ఎసై మంద చిరంజీవి, దావనందుల శేఖర్, గోవిందుల ప్రభాకర్, గోవిందుల నారాయణ, నెరుకోమ్ముల లక్ష్మణ్ రావు, కోత్తగోవిందుల పాపయ్య, బచ్చల లింగయ్య, దావనందుల లచ్చయ్య అను ఈ 9 మంది వ్యక్తులపై ఇదే నా మరణ వాంగ్ములంగా బావించి చట్టపరమైన చర్యలు తీసుకోనీ నాకు నా కుటుంబనికి న్యాయం చేయ్యగలరనీ నా యోక్క అభ్యర్థన.
ఇట్లు
విజేయ్ చిట్ల
గ్రామం:- గోపులపూర్
మండలం:- బుగ్గారం
జిల్లా :- జగిత్యాల
పోన్:- 8179541840