తెలంగాణలో జెన్టీయూ పరిధిలో సోమవారం జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు యూనివర్శిటీ ప్రకటించింది. వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో బీటెక్, ఫార్మసీ పరీక్షలను వాయిదా వస్తున్నట్లు తెలిపింది. రేపటి నుండి జరగాల్సిన పరీక్షలు యధాతథంగా జరుగుతాయని, వాయిదా పడ్డ పరీక్షల షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్శిటీ తెలిపింది.