ఈమధ్య ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేరు నిత్యం వార్తల్లో ఉంటోంది. అయితే ఎక్కువగా వివాదాల్లో ఉంటూ ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. తాజాగా ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ను ధర్మారెడ్డి అనుచరులు బెదిరించారు. దీనికి నిరసనగా జర్నలిస్టులు భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సెంటర్ లో నల్ల బ్యాడ్జీలతో ధర్నాకు దిగారు.
ప్రభుత్వం జర్నలిస్టులను టార్గెట్ చేసి వాస్తవాలను అణిచివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తొలివెలుగు జర్నలిస్ట్ రఘు, Q న్యూస్ మల్లన్నతో పాటు పలువురు జర్నలిస్టులను ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే… మఫ్టీలో పోలీసులు అరెస్ట్ చేసి భయానక వాతావరణం సృష్టించారని అన్నారు.
ఈ ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించాలని మహదేవపూర్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఎమ్మేల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తప్పులను ఎత్తిచూపితే సరిచేసుకోవాలని గానీ.. జర్నలిస్టులను బెదిరించడమేంటని ప్రశ్నించారు.