మీడియా లెజెండ్ రవిప్రకాశ్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ జర్నలిస్ట్‌లు. ఆర్థిక నేరాల్లో కూరుకపోయి, రాజకీయ నాయకులకు అక్రమార్జన సంస్కృతిని నేర్పిన మీరు రవిప్రకాశ్‌లాంటి నిఖార్సయిన జర్నలిస్ట్‌పై సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేయటం అంటే సూర్యుని మీద ఉమ్మివేయటమే అవుతుందని హితవు పలికారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో మీ అక్రమార్జన సంస్కృతి వల్లే ఎంతో భవిష్యత్ ఉన్న ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టంచేశారు. తొండ ముదిరితే ఊసరవెళ్లి అయినట్లు… మీరు సూడో చార్డెడ్ అకౌంట్ అయిన మీరు ఎంపీ కాగానే ఆగటం లేదని, మీ చరిత్ర మరిచి రవిప్రకాశ్‌లాంటి జర్నలిస్ట్‌పై విషప్రచారమా అని ప్రశ్నించారు.
ఒక జర్నలిస్ట్ తన 15ఏళ్ల కష్టంతో టీవీ9ను రారాజుగా నిలిపితే, విజయసాయి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు సాక్షిటీవీ రూపంలో అక్రమ సంపాదనతో టీవీని నడపటం లేదా అంటూ ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్ మీడియాకు రవిప్రకాశ్ దిక్సూచి అని, ఎంతో మంది తెలంగాణ బిడ్డలకు అవకాశం కల్పించటమే కాదు… సామాన్యవ్యక్తి క్రాంతికిరణ్‌కు జర్నలిజంలో ఓనమాలు నేర్పించి, ఎమ్మెల్యేగా గెలిచే వరకు సహాకారం అందించలేదా? మానుకోట రాళ్ల దెబ్బలు తిన్న సమైక్యవాది విజయసాయి… తన కష్టంతో, తెలివితో అంచెలంచెలుగా ఎదిగిన రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేయటమా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల సొమ్మును జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న మెఘా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరరావుల మెప్పుకోసమే… రవిప్రకాశ్‌లాంటి మేధావిపై ఫిర్యాదు అని తెలంగాణ జర్నలిస్ట్‌లు అభిప్రాయపడ్డారు.
రవిప్రకాశ్‌కు మద్దతుగా తెలంగాణ జర్నలిస్ట్‌లు విడుదల చేసిన కాపీ ఇదే…