యస్. అన్వేష్ రెడ్డి , ఛైర్మన్
తెలంగాణ కిసాన్ కాంగ్రెస్
సమగ్ర వ్యవసాయ వుధానం ప్రకటించడంలో తొందర పడొద్దని కిసాన్ కాంగ్రెస్ 30-04-2020 న ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి రైతులతో, వ్యవసాయ శాస్త్రవేత్తలతో , రిటైర్డ్ వ్యవసాయ అధికారులు , రైతు సంఘాలతో మాట్లాడి శాశ్వత వ్యవసాయ విధానం తేవాలని కోరినము.
దానికి భిన్నంగా అధికారులతో రైతు బంధు సమితిలతో, టి ఆర్ యస్ కార్యక్ర్తలతో ,రైస్ మిల్లర్లతో , పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటి ?.అపారమైన అనుభవం ఉన్న రైతులతో మాట్లాడకపోవడం రైతులను అవమానించినట్లే. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలంటే అనేక విషయాలు పరిగణంలోకి తీసుకోవాలి.
పత్రికల్లో వస్తున్న ముఖ్యమంత్రి ప్రకటనలు చూస్తే ప్రధానంగా వరి , పత్తి . కందులు , మక్కజొన్న పంటలపై నియత్రన పెట్టాలనే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. తరతరాలుగా రైతు తన అనుభవంతో నేలను భట్టి వనరుల అవకాశం భట్టి పంటలు వేస్తూ , ధేశానికి ఆహార ధాన్యాలు పండిస్తు అన్నాధాతగా సమాజంలో పేరున్నది. సమగ్ర వ్యవసాయ విధానంలో పసుపు , మిర్చి, చెరుకు మొదలగు పంటల మాట ఏమిటి ?.
ప్రభుత్వం ఏమైనా అన్నం పెట్టె రైతులుగా చూడాలని , ఆంక్షలు పెట్టి వెట్టిచాకిరికి గురిచేయొద్దు. ఈ మద్య రైతులు పండించిన పంటను కొనుగోలులో ప్రభుత్వం విఫలం అయినప్పుడు సిరిసిల్లలో దాన్యం తగలపెట్టడం , నిన్న అధిలాబాద్ లో పత్తి కొనకపోతే కొనుగోలు చేయాలు కేంద్రం దగ్గరనే రైతు అగ్రహంతో పత్తిని తగలపెట్టిన సంఘటన.
ముఖ్యమంత్రిగారు ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా పంటలు వేయకపోతే రైతు బంధు పథకం , కనీస మద్దతు ధర , ఉపాది హామీ పథకం , వ్యవసాయ పరికరాలపై జి.యస్.టి. మాటేమిటి ?. సమగ్ర వ్యవసాయ విధానంలో భూమి సారం , నీటి వనరులు, వాతావరణ పరిస్థితులు అనేకమైన విషయాలను పరిగనంలోకి తీసుకోవలసి వస్తుంది. అందుకే రాష్ట్ర కిసాన్ కాంగ్రేస్ వచ్చే సోమవారం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనుభవ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రిటైర్డ్ వ్యవసాయ అధికారులతో కాంగ్రేస్ పార్టీ శ్రేనులతో విస్తృతంగా చర్చించి మా భాద్యతగా ప్రభుత్వానికి నివేదిక పంపుతాము.