తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుంది. ఆదివారం టెస్టుల సంఖ్యను ప్రభుత్వం సగానికి సగం తగ్గించినప్పటికీ కేసుల్లో మాత్రం స్వల్ప తేడాతో అంతే భారీ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గడిచిన 24గంటల్లో 37,791టెస్టులు చేయగా 1873కొత్త కేసులు, 9మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,24,963కు చేరగా… మరణాల సంఖ్య 827కు చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 31,299యాక్టివ్ కేసులుండగా… 92,837మంది కోలుకున్నారు. దేశంలో కోలుకుంటున్న వారితో పోల్చితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు వెనుకంజలో ఉంది. దేశంలో రికవరీ రేటు 76.55శాతం ఉండగా, రాష్ట్రంలో 73.3శాతంగా నమోదైంది. గత 24గంటల్లో చేసిన ప్రైమరీ కాంటాక్టుల టెస్టులు 17,006కాగా, సెకండరీ కాంటాక్ట్ టెస్టులు 5,290అని ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.
కొత్తగా వచ్చిన కేసుల్లో జీహెచ్ఎంసీలో 360, కరీంనగర్ 180, ఖమ్మం 103, రంగారెడ్డి 129, వరంగల్ అర్భన్ లో 94 కేసులు వచ్చాయి.