రెండు నెలలుగా జీతాలు లేకున్నా, ఆర్ధాకలితో అలమటిస్తూ…తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో పోరాడుతోన్న ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులు అండగా ఉంటున్నారు. న్యాయవాదుల జేఏసీ తరుపున ఆర్టీసీ కార్మికులకు తమ వంతు సహయాన్నిఅందిస్తున్నారు. కాచిగూడ, బర్కత్‌పుర డిపోలకు చెందిన దాదాపు 200మంది కార్మికులకు ఐదు కిలోల బియ్యం చొప్పున బియ్యం ప్యాకెట్లను అందజేశారు. మేము మీకు అండగా ఉంటామని న్యాయవాదులు భరోసా కల్పించారు.
సెప్టెంబర్ నెలలో ఉద్యోగం చేసినా… ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. ఇక అక్టోబర్ నుండి కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. జీతాలు లేకపోవటంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.