హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టును బద్వేల్ తరలించాలన్న ప్రభుత్వ ప్రతివాదనల పేపర్లను దగ్దం చేసి న్యాయవాదులు నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణ హైకోర్టు తరలింపుపై హైకోర్టు ఎదుట ఆందోళన చేస్తున్న న్యాయవాదులు.. వందేళ్ల చరిత్ర కలిగిన హైకోర్టును తరలిస్తే ఉరుకునేది లేదని ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతమంది చెబుతున్నా వినకుండా హైకోర్టు తరలిస్తే మరో తెలంగాణ ఉద్యమం చూడాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. రాష్టవ్యాప్తంగా అన్ని కోర్టులలో విధులను స్తంభింపజేస్తామని, ప్రతిపక్ష పార్టీలను కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని అంటున్నారు.