కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల సామర్థ్యాల్లో ఉన్న అసమానతలను సవరించాలని ఈఎన్సీ మురళీధర్ రావు లేఖ రాశారు. 1952లో ఏపీ, హైదరాబాద్ స్టేట్ ల మధ్య కుదిరిన అంతరాష్ట్ర ఒప్పందం ప్రకారం రెండు కాల్వలు సమానంగా ఉండాలని, కానీ కుడి కాలువ సామర్థ్యం 500అడుగల వద్ద 11వేల క్యూసెక్కులు ఉంటే… ఎడమ కాలువ సామర్థ్యం 520అడుగల వద్ద 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఎండీడీఎల్ 510అడుగుల వద్ద ఎడమ కాలువ సామర్థ్యం 7899క్యూసెక్కులుండగా, కుడి కాలువ సామర్థ్యం 24,606క్యూసెక్కులు ఉందని… ఇదే అతిపెద్ద అసమానత అని తెలంగాణ పేర్కొంది.
ఏపీకి ఇతర మార్గాల ద్వారా నీరు వాడుకునే అవకాశం ఉన్నందున… కృష్ణా నది నీరును ఎక్కువగా తెలంగాణ వాడుకునేలా అవకాశం ఇవ్వాలని కోరింది.