మంత్రి హరీష్ రావు… టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్. ఒకప్పుడు పార్టీలో నెం.2గా ఉన్నా, ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ పార్టీ కోసం పనిచేసినా… మంత్రిగా మొదటి దఫా ఎలా పనిచేశారో అందరికీ తెలుసు. కానీ టీఆర్ఎస్‌లో ఆదిపత్య పోరు నడుస్తోందని, కేసీఆర్ అనుకూల మీడియాలో కనీసం ఆయన ఫోటో కూడా కనపడకుండా చేస్తున్నారన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. పైగా రెండో సారి అధికారంలోకి రాగానే మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.
అయితే, తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పదవి అయితే దక్కింది కానీ హరీష్‌ను ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేశారని ప్రచారం సాగుతోంది. అందుకే ఆర్థికమంత్రి ఇచ్చారని రకరకాల వార్తలు వచ్చాయి. ఇటు హరీష్ రావు కూడా మెదక్‌కే పరిమితం కావటంతో పాటు ఇతరత్రా మీటింగ్‌లలో పాల్గొన్నా అవేవీ గతంలో ఉన్నంత ముఖ్యమైనవి కావనే అభిప్రాయం సర్వత్రా ఉంది.
రేవంత్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన ఆ నేతలు
ఇక కొంతకాలంగా మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్‌లో ఎక్కడెక్కెళ్లినా పాఠశాలల పరిస్థితులపై ఆరా తీయటం, విద్యార్థులకు ప్రశ్నలు వేయటం చేస్తున్నారు. అంతేకాదు సిద్ధిపేటలో అయితే పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు 25వేల ప్రోత్సాహం కూడా అందిస్తానంటూ హమీ ఇస్తున్నారు. తాజాగా సంగారెడ్డి పర్యటనలో ఏకంగా టీచర్ అవతారం ఎత్తారు మంత్రి హరీష్‌రావు. విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ, వారు సరైన సమాధానాలు చెప్పకపోతే ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు.
కేటీఆర్ కోసమే కేసీఆర్ వ్యూహం మార్చారా…?
ఇది చూసిన వారంతా… ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారుల మీటింగ్‌లలో బీజీగా ఉండే నేత… పాఠశాలలు, చిన్న చిన్న మీటింగ్‌లతో కాలం గడుపుతున్నారంటూ అభిప్రాయపడుతున్నారు.
Advertisements
బాధితుడిగా పోలీస్ స్టేషన్ కు ఐపీఎస్..సిబ్బందిపై వేటు