కరోనా ప్రజలందరూ సహజీవనం చెయ్యకతప్పదన్నారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ వచ్చేవరకు జాగ్రత్తలు తీసుకుని జీవనం గడపటం తప్ప ఏం చెయ్యలేని పరిస్థితిలో ప్రపంచం ఉందన్నారు కేటీఆర్. లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో గ్రీన్, ఆరెంజ్, జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపాలిటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం పాటిస్తున్న మాస్కుల వినియోగం, భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం వంటి వాటిని ఇకపైన కూడా కొనసాగించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కేటీఆర్ పై విధంగా స్పష్టత ఇచ్చారు.