తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడ్డ ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ నిర్ధారణ కాగా, కొందరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో మంత్రి మల్లారెడ్డి కూడా చేరారు.
మంత్రి మల్లారెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషనల్ ఉంటున్నట్లు సమాచారం. దీంతో మంత్రి మల్లారెడ్డితో ఇటీవల కాంటాక్ట్ అయిన వారంతా ఐసోలేట్ అవుతున్నారు.
ఇప్పటి వరకు తెలంగాణలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, సుధీర్ రెడ్డి, గొంగిడి సునీత, భాస్కర్ రావు, సతీష్ లతో పాటు హోంమంత్రి మహమూద్ అలీలకు కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా మంత్రి మల్లారెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు.