బీసీల వాయిస్‌గా వస్తుందని ప్రచారం సాగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు చెందిన ఐ ఎన్ బి ఛానల్ మూతపడింది. అందులో పనిచేస్తున్న 30మంది ఉద్యోగులకు ఈ విషయం చెప్పేసింది ఛానల్ యాజమాన్యం. గతంలో అనేక మంది చేతులు మారుతూ వచ్చిన ఈ సంస్థ ఇటీవలి వరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూతురు చూసుకునేవారు. కానీ ప్రగతి భవన్ పెద్దలు నో చెప్పటంతో ఛానల్ మూసేశారు.
నిజానికి ఐ ఎన్ బి ఛానల్ కేబుల్ ఛానల్‌గానే ఉన్నా… శాటిలైట్ ఛానల్ చేసే ప్రయత్నం జరురుగుతుందన్న ప్రచారం సాగింది. కానీ దానికి కూడా టీఆర్ఎస్ ముఖ్యనేతలు నో చెప్పటంతో ఉద్యోగులందరికీ ఒక నెల జీతం అదనంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఇదే తరహాలో కొన్ని ఛానళ్స్ మూసివేయించగా… ఇప్పుడా లిస్ట్‌లో ఐఎన్‌బి కూడా చేరిపోయింది.