గతంలో ఓ సమావేశంలో గుట్కాలు తినుడు, జర్ధా బుక్కుడు… అన్నీ గలీజ్ సోపతులు. తాగుడు.. కొట్టుడు… దొంగతనం అలవాటైతది అంటూ మంత్రిగా కేటీఆర్ ఓ ఉపన్యాసం దంచికొట్టాడు. ఔ… నిజమే కదా అని అంతా అనుకున్నారు. కానీ తెలంగాణలో నిషేధించాం అని చెప్తున్న గుట్కాలు, జర్ధాలు స్వయంగా మంత్రులే తింటుంటే…?
మంత్రులు తలసాని, గంగుల కమాలకర్ గుట్కా సీక్రెట్ కెమెరాలకు చిక్కింది. ఎవరూ చూడకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో మంత్రి గంగులకు గుట్కా ఇవ్వటం… దాన్ని ఆయన అంతే చాటుగా నోట్లే వేసుకోవటం కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇవి కూడా గలీజ్ సోపతే కదా… ఏం సమాధానం చెప్తావ్ కేటీఆర్ అంటూ సోషల్ మీడియాలో వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా జర్ధా, గుట్కా రవాణాలో అధికార పార్టీ నేతలున్నారన్న ఆరోపణలున్నాయి. రహస్యంగా తెలంగాణలోనూ గుట్కా తయారీ కేంద్రాలు నడుపుతున్నారన్న ప్రచారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మంత్రులే స్వయంగా గుట్కా తినేస్తున్న వీడియో స్పష్టంగా కనపడుతుంది. మరీ దీనికి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారో….
మంత్రుల గుట్కా రహస్య వీడియో ఇదిగో-