సీఎంగా కేటీఆర్ ఈ నినాదం అందరికీ తెలిసిందే. తెలంగాణ మంత్రులంతా పోటీ పడి మరీ… కేటీఆర్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలున్నాయని, జనం మెచ్చిన నాయకుడంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పుడు మంత్రులు కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
సీఎం కేసీఆర్ ప్రజానాయకుడు, ఆయనకు ప్రధాని అయ్యే అన్ని అర్హతలున్నాయంటూ మంత్రులు కామెంట్స్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రులంతా తమ తమ జిల్లాల్లో క్యాడర్‌తో కలిసి హరిత హరంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నేతలంతా ప్రతి ఒక్కరు మొక్క నాటాలని కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు చెట్లు నాటుతూ… ప్రధాని కేసీఆర్ అంటూ కామెంట్స్ చేశారు.
దీంతో మరోసారి సీఎం కేటీఆర్ అన్న ప్రచారం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎంగా కేటీఆర్ అంటూ ప్రచారం సాగింది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ థంపింగ్ విక్టరీ నమోదు చేసినా, సీఎం పదవిపై కేసీఆర్ ఆలోచనలు పార్టీ నేతలకు కూడా అంతుచిక్కటం లేదు. కానీ మంత్రులంతా సీఎం కేటీఆర్ అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్‌ను ప్రధాని అంటూ స్టేట్‌మెంట్ ఇవ్వటం చర్చనీయాంశం అవుతోంది.