జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేటలో మంత్రులకు చుక్కెదురైంది. గ్రామ సభ కోసం బయలుదేరిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ కొండగట్టు బాధితుల ఆందోళనకు అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది.
కొండగట్టు ప్రమాదం జరిగి ఏడాదైనా మృతుల కుటుంబాలకు ఇప్పటిదాకా పరిహారం అందలేదు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో గ్రామ సభకు వెళ్తున్న మంత్రుల్ని నిలిపివేసి కాన్వాయ్ కు అడ్డంగా బైఠాయించడం జరిగింది. పరిహారం తేల్చే దాకా కదిలేది లేదని భీష్మించడం జరిగింది. పోలీసులు, నాయకులు ఎంత నచ్చజెప్పినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. ప్రమాద ప్రమాదం మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వాలని, ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని డిమాండ్ చేయడం జరిగింది. మంత్రులు సహజ ధోరణిలో పరిశీలిస్తామని చెప్పినప్పటికీ గ్రామస్తులు కచ్చితమైన హామీ ఇస్తేనే ఇక డ నుంచి కదులుతామని తేల్చి చెప్పడం జరిగింది. దీంతో మంత్రులు డిమాండ్లు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వారికి దారి ఇవ్వడం జరిగింది.
కొసమెరుపు ఏమిటంటే మంత్రుల కాన్వాయ్ కు అడ్డుపడి రోడ్డుపై బైఠాయించిన వారిపై పోలీసులు, మంత్రులు కూడా అసహనం వ్యక్తం చేయడంతో 8 మందిపై కేసులు పెట్టారు. గ్రామస్తులు దీన్ని తప్పు పట్టారు. పరిహారం అడిగితే కేసులు పెడతారా? ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నించారు.