దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ది చెందుతోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ మొబిలిటీ వీక్ ఈవెంట్ జరగడం సంతోషకరమని ఆయన వ్యాఖ్యానించారు.
మాదాపూర్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యమ్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి, డెలిగేట్స్ తో కలిసి ఈ మొబిలిటీ వ్యాలీ నమూనా బిల్డింగ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….
హైదరాబాద్ వేదికగా ఈ ఈ -మొబిలిటీ వీక్ ఘనంగా ప్రారంభమైందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈవీ రంగాన్నీ మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ ఫిబ్రవరి 11న జరగనుందని తెలిపారు.
ఇక్కడ కావల్సినన్ని వనరుల ఉన్నాయన్నారు. అందువల్లే ఈవీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ప్రారంభిస్తున్నామన్నారు. వికారాబాద్, ఎల్కతాలలో ఈ మొబిలిటీ వ్యాలీని 12 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇక్కడ ఈవీ బెస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాచ్ రింగ్, రీసర్చ్ అండ్ డెవెలప్మెంట్ కార్యకలాపాలు జరగనున్నాయన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ క్లస్టర్ జహీరాబాద్, సీతారాంపూర్ లో, ఎనర్జీ స్టోరేజ్ సిస్టం దివిటిపల్లిలో మొత్తం 1200 ఎకరాల్లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ మొబిలిటీ వ్యాలీ ద్వారా రాబోయే 3 ఏండ్లలో 50వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, తద్వారా 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలని కోరారు.