తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎలాంటి ఉద్యోగ పరీక్షలు లేకుండా… ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శాసనమండలి వేదికగా మంత్రి కేటీఆర్ తీపి కబురు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకకాలు చేపడుతున్నామని ప్రకటించారు.
మొదటి మూడు సంవత్సరాలు ప్రొబేషనరీ కాలం ఉంటుందని, వార్డు ఆఫీసర్ కు ప్రత్యేక కార్యాలయాల నిర్మాణం కూడా చేపడతామని మంత్రి ప్రకటించారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పనిచేయాలని వెల్లడించారు.
గ్రామ పంచాయితీల్లో పంచాయితీ కార్యదర్శి పోస్టులను ఎలా అయితే భర్తీ చేశారో… వార్డు ఆఫీసర్ పోస్టులను కూడా అలాగే భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు, స్కేల్ ఎలా ఉంటుంది, పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారా లేక ప్రత్యేక బోర్డు ద్వారా సంబంధిత మున్సిపల్ శాఖే ఆ బాధ్యత తీసుకుంటుందా అన్న అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.