తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 47,386 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 573 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 724కి చేరింది. కరోనాతో నిన్న నలుగురు మృతి చెందారు. ఫలితంగా మరణాల సంఖ్య మొత్తం 1,493కి పెరిగింది.
కరోనాబారి నుంచి నిన్న 609 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2 లక్షల 68 వేల 601కి చేరాయి.. రాష్ట్రంలో ప్రస్తుతం 7 వేల 630 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇందులో 5,546 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 61.64 లక్షల కరోనా పరీక్షలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది