తెలంగాణ కొత్త సచివాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులు ఎప్పుడు పూర్తవుతాయా? వెంటనే ప్రారంభించేద్దామని సీఎం కేసీఆర్ కూడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభం కానుంది. ఈమేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తేదీని ప్రకటించారు. అయితే.. అదే రోజు కేసీఆర్ పుట్టిన రోజు కూడా ఉంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
సచివాలయం తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనుల్లో ఇంకా వేగం పెంచాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను, అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టు సెక్రటేరియట్ పనులు జరుగుతున్నాయి.
మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు చేస్తున్నారు. ఈ పరిపాలన భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు.