తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసే విషయంపై కేంద్రం స్పందించింది. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో గిరిజన వర్సీటీలు ఉన్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి రెండు గిరిజన వర్సిటీలు ఉన్నట్టు పేర్కొన్నారు.
దేశంలో 2020-21 నాటికి 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులున్నారని కేంద్రం పేర్కొంది. ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 2 వర్సిటీల్లో 523 మంది విద్యార్థులే ఉన్నారని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో గిరిజన వర్సిటీల ఏర్పాటు ప్రతిపాదన ఉందని చెప్పింది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించింది. అవసరాన్ని బట్టి గిరిజన వర్సిటీలను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అన్నారు. వీటికి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.
లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ సహా సభ్యుల అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఈ రోజు కూడా అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్ లో రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో సభలను వాయిదా వేశారు.