తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారు జలదీక్షకు దిగాయి. పోతిరెడ్డిపాడుతో శ్రీశైలంకు పొక్కగొట్టి తెలంగాణ నీటిని ఎత్తుకెళ్లారు అని గతంలో ఆరోపించిన కేసీఆర్… ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్ ఓడిపోతే సీఎంగా ఉండే హక్కు కూడా కోల్పోతారని విమర్శిస్తున్నారు.
పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే మహబూబ్ నగర్, నల్గొండ ఎడారిగా మారిపోతాయి. ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కై ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. గాంధీ బవన్ లో మాజీ ఎమ్మెల్యే సంపత్ సహా పలువురు నేతలు దీక్షకు దిగారు. బీజేపీ కార్యాలయంలోనూ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు.
నీటి దోపిడి జరిగితే సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని, పోతిరెడ్డి విషయంలో కేసీఆర్ వైఖరి అనుమానస్పదంగా ఉందంటూ పీసీసీ అధ్యక్షుడు మండిపడ్డారు. ఏపీ అక్రమంగా నీటి తరలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. శ