కరోనాతో ఈ ఏడాదంతా ఇంటికే పరిమితం అయిన ప్రజలు, యువత కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 31న సాయంత్రం నుండి వేడుకలకు రెడీ అవుతున్న సమయంలో తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా… పబ్ లు, రిస్టార్టుల్లో ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. గేటెడ్, కమ్యూనిటీల్లోనూ ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పబ్లిక్ గా ఎలాంటి వినోద కార్యక్రమాలు చేపట్టరాదన్నారు.
డిసెంబర్ 31న రాత్రి నుండి డ్రైంకన్ డ్రైవ్ తనిఖీలుంటాయని… హైదరాబాద్ వ్యాప్తంగా నిషేధాజ్ఞలుంటాయన్నారు. స్టార్ హోటల్స్ లో రోజువారి కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఉందని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టరాదన్నారు.