దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు తెలంగాణ పోలీసులను ప్రశంసించారు. మహిళలు రాఖీలను కట్టి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కథ నడిచి మెత్తగా మూడు రోజులు కూడా గడవలేదు మరో సారి పోలీస్ ల వైఫల్యం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ను లైంగిక వేధించిన స్థానిక తెరాస నాయకుడు అతని గూండాలపై కేసు పెట్టడానికి వెనుకడువేశారు పోలీసులు . ఓల్డ్ బోయన్ పల్లి లో ఓ స్థలానికి కాపలాదారుడిగా ఉన్న వ్యక్తి పై స్థానిక తెరాస నేత ఎస్. మాధవ్ రెడ్డి దాడి చేసి తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయమై ఒక రోజు తరువాత, ఈ జంట ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చెయ్యటానికి వెళ్లారు. ఓల్డ్ బోయన్ పల్లి లో శివ ఎనక్లేవ్ లో 103 నుండి 106 మరియు 111 నుండి 114 వరకు ప్లాట్లు ఉన్నాయి. ఇది ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆదీనంలో ఉంది . అక్కడే ఖాళీ స్థలంలో కాంపౌండ్ గోడ ఉంది. దీనిలో శరణప్ప, భార్య, కొడుకు కుమార్తెతో కలిసి ఒక చిన్న ఇంటిలో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి, టి. మాధవ్ రెడ్డి, ఎస్. మాధవ్ రెడ్డిలు 10 మంది అనుచరులతో మూడు జెసిబిలతో వచ్చి, కాంపౌండ్‌లోకి చొరబడి గోడను పడగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో శరణప్ప జోక్యం చేసుకోవడంతో అతన్ని కొట్టారు. ఇద్దరు టిఆర్ఎస్ నాయకురాలు మాధవ్ రెడ్డి లు వాచ్ తన భార్యపై లైంగికంగా
వేధించారని బాధిత మహిళ ఆరోపిస్తుంది. కాంపౌండ్ గోడను పూర్తిగా కూల్చివేసిన అనుచరులకు భయపడిన ఆ జంట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సానుకూలంగా స్పందించలేదు. ఇది సివిల్ కేసంటూ నిర్లక్యం వహించారు. తదనంతరం, చాలా గంటలు గడిచిన తరువాత, ఎఫ్ఐఆర్ నమోదైంది. కాని ఆ ఇద్దరు నేతలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా తమపై ఫిర్యాదు చెయ్యటానికి ఎంత ధైర్యం అంటూ ఆగ్రహం లో రగిలిపోయిన ఇద్దరు నేతలు పెట్రోల్ తీసుకుని వాచ్ మ్యాన్ శరణప్ప ఇంటికి వెళ్లారు. బయటకు వచ్చిన అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం శరణప్ప 45 శాతం కాలిన గాయాలతో చికిత్శ్య పొందుతున్నాడు. అయితే పోలీసులు నిర్లక్యంపై ఓ సీనియర్ నాయకుడి ఒత్తిడి ఉన్నట్ట్టు సమాచారం.