పోలీసులు ఏం చెబుతున్నారంటే!!
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఉదయం 6 , 6:30 సమయంలో జరిగిందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
తొలి వెలుగుతో పోలీస్ అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం పోలీసుల చేతుల్లో ఉన్న గన్ ను లాక్కునే ప్రయత్నం చేశారని, అందుకే తప్పని పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
కేవలం పారిపోవడం వల్లే ఎన్ కౌంటర్ జరిగిందన్నది వాస్తవం కాదు . పోలీసుల చేతుల్లో ఉన్న గన్ లాక్కునే ప్రయత్నం చేశారు కాబట్టే ఎన్ కౌంటర్ చేసినట్టు కనిపిస్తోంది.