తెలంగాణ రాష్ట్రం లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అటకెక్కిపోయింది. ఫ్రెండ్లీ పోలీస్ పేరు చెప్పి ఇప్పుడు లాఠీ లతో రెవెట్టేస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడుతున్నారు. చేతి దూల తీర్చుకోడానికి ఇదే అదునుగా భావించి సామాన్యులను కొట్టడం, కసురుకోవడం ఎక్కువ అయింది. అసలు ఎందుకు కొడుతున్నారో అర్ధంకాదు. పౌరులు ఏ నిబంధనలు అతిక్రమించారో తెలియదు.వాళ్లు బీటు ఉన్న సెంటర్ లో వాళ్లకి ఎదురులేదన్నట్టు శాడిజం చూపిస్తూ చర్మం పగిలిపోయేట్టు కొడుతున్నారు.
రాష్ట్ర ముఖ్య మంత్రి పోలీస్ లను పొగడటం, జనతా కర్ఫ్యూ రోజు ధన్యవాదాలు తెలపడంతో ఒక మందాన పొగరెక్కినట్టుంది. హోమ్ గార్డులు, కానిస్టేబుల్స్ కి ఎదుట వ్యక్తి వయస్సు, పెద్దరికం వంటివి కనిపించడం లేదు. అరే, ఒరే అన్న నోటి దురుసు చూపిస్తున్నారు.
ఈ నాల్రోజులకే పోలీస్ లు ఇలా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.