తెలంగాణలో పోలీసు కొలువుల కోసం నోటిఫికేషన్ వెల్లడైన నేపథ్యంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పరీక్ష తేదీలు ఖరారు అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుల్ ప్రలిమినరీ రాత పరీక్షల తేదీలను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్టుగా పేర్కొన్నారు. ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నట్టుగా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు www.tslprb.in ద్వారా పొందవచ్చని బోర్డు తెలిపింది. జూలై 30 నుంచి ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకన్న అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ చేసుకోవచ్చని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.