తెలంగాణలో ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీ కమిషన్ రిపోర్టు భయటకు వచ్చేసింది. పీఆర్సీకి సంబంధించి బిశ్వాల్ కమిటీ గత నెల 31న ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వగా… తాజాగా నివేదికను సర్కార్ బహిర్గతం చేసింది.
కొత్త పీఆర్సీ ఎంత ఇవ్వాలని చెప్పారంటే….
1.ఉద్యోగులకు పీఆర్సీని 7.5శాతం పెంచాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో కనిష్ట వేతనం 19వేలు, గరిష్ట వేతనం 1,62,700గా ఉండాలని చెప్పారు. గతంలో కనిష్ట వేతనం 16వేలుగా ఉండేది.
2.బేసిక్ పే మీద ఇచ్చే హెచ్.ఆర్.ఏ ను బిశ్వాల్ కమిటీ తగ్గించింది. హైదరాబాద్ వంటి ఏరియాల్లో 30శాతం ఉన్న హెచ్.ఆ.్ఏ ను 24శాతంకు తగ్గించాలని సిఫార్సు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 11శాతంకు తగ్గించారు. ఇతర స్లాబులను 13, 17కు కుదించారు.
3. చైల్డ్ కేర్ లీవ్స్ ను మూడు నెలల నుండి నాలుగు నెలల వరకు పెంచారు.
4. వికలాంగులైన పిల్లలున్న వారికి 2 సంవత్సరాల వరకు చైల్డ్ కేర్ లీవ్స్.
5. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58సంవత్సరాల నుండి 60సంవత్సరాలకు పెంచాలని సూచన.
తమ సూచనలను ప్రభుత్వం యాధావిధిగా అమలు చేస్తే… ఈ పీఆర్సీ ద్వారా 2,250కోట్ల మేర అదనపు భారం పడుతుందని తెలిపింది.
గతంలో ప్రభుత్వాలు ఉద్యోగులకు ఎంత పీఆర్సీ ఇచ్చిందో చూస్తే… 2009లో సీఎం రోశయ్య హాయంలో 39శాతం, 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో 43శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. అయితే, పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే ఉంటుంది. బైశ్వల్ కమిషన్ ఇచ్చిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.