లాక్ డౌన్ కారణంగా కాలేజీలు మూతపడ్డాయి. దీంతో ప్రైవేటులో పనిచేసే లెక్చరర్లకు ఏప్రిల్, మే నెల జీతాలు ఇవ్వలేవు చాలా కంపెనీలు. కార్పోరేటు కాలేజీలు కూడా జీతాలివ్వటం లేదు. దీంతో ఉపాది కోసం వారంతా ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లను నమ్ముకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తోంది. అందుకోసం ప్రతి లెక్చరర్ కు ప్రభుత్వం కొంత పే చేస్తుంది. దాంతో వాటి కోసం ఇప్పుడు ప్రైవేటు లెక్చరర్లు పోటీ పడుతున్నారు.
13 సబ్జెక్ట్స్ పేపర్ వాల్యూయేషన్ కోసం 15000మంది లెక్చరర్ల సేవలను ప్రభుత్వం వాడుకుంటుంది. ఇందులో 9వేల మంది ప్రైవేటు, కార్పోరేటు కాలేజీల వారే. 3500మంది కాంట్రాక్టు లెక్చరర్లు కాగా, 917మంది ప్రభుత్వ లెక్చరర్లు, 1500గెస్ట్ లెక్చరర్లు.
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు జీతాలివ్వకపోవటంతో జీవనం దుర్భరంగా మారిపోయిందని, లాక్ డౌన్ సమయంలో పెరిగిన ఖర్చులతో ఇబ్బందిపడుతున్న సందర్భంలో వాల్యూయేషన్ రావటంతో ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారని ప్రైవేటు లెక్చరర్ల ఫోరం అభిప్రాయపడుతుంది.
ఇటు ప్రభుత్వం కూడా వచ్చిన వారిని ఎవరినీ వెనక్కి పంపకుండా… అందరి సేవలను వినియోగించుకుంటుంది. ఇంత లాక్ డౌన్ సమయంలోనూ కొన్ని వాల్యూయేషన్ సెంటర్లలో 100శాతం హాజరవుతున్నారని, కొన్ని చోట్ల 110శాతం హాజరు అవుతున్నారని ఇంటర్ బోర్డ్ తెలిపింది.